గద్వాలలో 86.77శాతం పోలింగ్ నమోదు
GDWL: జిల్లాలోని నాలుగు మండలాల్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొత్తం 86.77 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ బీ.ఎం.సంతోష్ తెలిపారు. నాలుగు మండలాల్లోని 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 92 గ్రామ పంచాయతీలలో ఉదయం 7:00 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. ప్రతి రెండు గంటలకు ఓసారి పోలింగ్ శాతాన్ని అధికారులు పరిశీలించినట్లు చెప్పారు.