నంద్యాల DAHO కీలక సూచనలు
NDL: అధిక వర్షాల నేపథ్యంలో పిడుగుల నుంచి పశువుల సంరక్షణకు నంద్యాల జిల్లా పశువైద్యాధికారి డా.గోవింద్ నాయక్ ఓ ప్రకటనలో పాడి రైతులకు కీలక సూచనలు చేశారు. నదులు, నీటి కుంటలు, లోహపు వస్తువులకు పశువులను దూరంగా ఉంచాలన్నారు. పశువుల షెడ్లకు లైటింగ్ కండక్టర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కాపరులు చెట్ల కింద కాకుండా, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు.