పెద్దమ్మ తల్లికి బోనాలు
BHNG: ముదిరాజుల కుల దైవం పెద్దమ్మ తల్లీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు భోగి పండగను పురస్కరించుకుని ముదిరాజ్ కులస్థులు పెద్దమ్మ తల్లీకి, గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. అమ్మ వారికి వెండి కన్నులు, ఒడి బియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. గడిబజార్, కొత్త బస్టాండ్, పోతాయి గడ్డ, సుందరయ్య కాలనీ, కొండాపురం, మంగలి గడ్డ, జామ చెట్ల బావి, ధర్మాపురం నుంచి మహిళలు పాల్గొన్నారు.