అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్ సరఫరా
SRPT: విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా నిరంతరం సరఫరా చేయాలనే లక్ష్యంతో బస్తిబాట నిర్వహిస్తున్నట్లు మండల విద్యుత్ శాఖ ఏఈ సురేందర్ పేర్కొన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం బండరామారంలో సమస్యలు గుర్తించి పరిష్కరించారు. ఇక మీదట ప్రతి మంగళ, గురు, శని వారాలు బస్తీబాట నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.