ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

TPT: ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది పంపిణీ చేశారు. గూడూరు మున్సిపల్ పరిధిలోని నెల్లటూరు సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ వాత్సల్య ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు రూ.4 వేల పింఛన్లను పంపిణీ చేశారు. ప్రతినెలా ఒకటో తేదీ పంపిణీ చేసే పింఛన్లను ఈ నెల ఒకటో తేదీ ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఇవాళే పంపిణీ చేస్తున్నారు.