జిల్లాలో 40 దాటిన టెంపరేచర్
NZB: జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత 'అలర్ట్' స్థాయికి చేరింది. ముఖ్యంగా మోస్రా, సాలూరలో అత్యధికంగా 41.6°C, నిజామాబాద్ సౌత్ 41.5°C, పెర్కిట్ (ఆర్మూర్) 41.5°C, యెడపల్లి 41.5°C, మంచిప్ప, తుంపల్లిలోనూ 41.5 డిగ్రీల వేడి నమోదైంది. ఉదయం నుంచే సెగలు పుడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.