రెండవ రోజు తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు మంగళవారం రెండు వాహన సేవలు జరగనున్నాయి. ఉదయం 8 గంటలకు పెద్దశేష వాహనం, రాత్రి 7గంటలకు హంస వాహన సేవలు ఉంటాయి. ఆయా వాహనాలపై అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు.