లోక్ అదాలత్‌లో సత్వర పరిష్కారం: మోతె ఎస్సై
SRPT: మార్చి 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మోతే ఎస్సై అజయ్ కుమార్ సూచించారు. పెండింగ్ కేసులు, చిన్నపాటి వివాదాలు, ట్రాఫిక్ చలానాలు వంటి సమస్యలను లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్‌లో పరస్పర సమ్మతితో తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.