రాపాక వరప్రసాద్ ఏ పార్టీలోకి?

EG: జిల్లా రాజకీయాల్లో రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలు ఇటీవల సంచలనంగా మారాయి. వైసీపీకి దూరమవుతున్నట్లు ఆయన ప్రకటించగా.. ఏ పార్టీలో చేరతారనేది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఆయన టీడీపీ వైపు చూస్తున్నట్లు, ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. గతంలో జనసేన నుంచి బయటకు వచ్చిన రాపాక.. ప్రస్తుతం టీడీపీలో చేరడంపై మిత్రపక్షం జనసేన నుంచి ప్రతికూలత వ్యక్తమవుతుంది.