నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ సీఎం

అన్నమయ్య: రాజంపేట మండలం ఆకేపాటి ఎస్టేట్స్‌లో రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి కుమారుడు వివాహం జరిగింది. ఈ మేరకు నూతన దంపతులు ఆకేపాటి అనురాగ్ రెడ్డి, వరదీక్షితరెడ్డిలను మంగళవారం YS జగన్ అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆకేపాటి అమర్నాథరెడ్డి కుటుంబ సభ్యులందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించారు. అనంతరం నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.