నేడు ఘంటసాల పాటల పోటీలు
AKP: ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఎలమంచిలిలో ఆదివారం రాష్ట్రస్థాయి పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధి ఆడారి పూరి జగన్నాథం తెలిపారు. స్థానిక ఘంటసాల కళామందిర్ ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి పాటల పోటీలు ప్రారంభం అవుతాయన్నారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని అన్నారు.