'ప్రచారం ఎక్కువ, కార్యాచరణ తక్కువ'
VSP: రాష్ట్రంలో పెట్టుబడుల పేరుతో ప్రచారం ఎక్కువ, కార్యాచరణ తక్కువగా ఉందని సీపీఎం నేత బి.వి. రాఘవులు అన్నారు. సోమవారం జగదాంబ సీఐటీయూ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీఐఐ సమ్మిట్లు, పెట్టుబడి అంకెలు వాస్తవం కాదని, భూములు తీసుకున్నా పరిశ్రమలు రాలేదన్నారు. డేటా సెంటర్లు ఉపాధి ఇవ్వవని, ఫుట్వేర్, గార్మెంట్ వంటి రంగాలే ఉద్యోగాలు సృష్టిస్తాయని చెప్పారు.