జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

NLR: నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ పాల్గొన్నారు. వాకాడు మండలంలోని కొండూరుపాలెం గ్రామానికి జలజీవన్ మిషన్ ద్వారా 98 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ స్టోరేజ్ ట్యాంక్ నుండి త్రాగునీటిని విడుదల చేసిన గ్రామీణ నీటి సరఫరా అధికారులకు ఎమ్మెల్సీ ధన్యవాదాలు తెలిపారు.