ఎస్సీ, ఎస్టీ కోర్ట్ న్యాయమూర్తిగా బీసీ శశికుమార్
ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ కోర్ట్ న్యాయమూర్తిగా బీసీ శశికుమార్ బాధ్యతలు స్వీకరించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేసుల పరిష్కారంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పరస్పరం సహకరించుకుని, కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నగేష్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి సంగీత పాల్గొన్నారు.