50% విమానాల్లో సాంకేతిక లోపాలు

50% విమానాల్లో సాంకేతిక లోపాలు

దేశ పౌర విమానయాన రంగంలో భద్రత లోపాలపై పార్లమెంట్ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత ఎయిర్‌లైన్లకు చెందిన 50 శాతం వాణిజ్య విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించింది. ఏడాది కాలంగా నిర్వహించిన ఆడిట్‌లో ఈ విషయం వెల్లడైంది. జనవరి 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు 754 విమానాల్లో ఈ ఆడిటింగ్ జరిగింది. 377 విమానాల్లో పునరావృతమయ్యే సాంకేతిక లోపాలు బయటపడ్డాయి.