సైనికులకు ట్రంప్ క్రిస్మస్ గిఫ్ట్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశ సైనికులకు క్రిస్మస్ గిఫ్ట్ ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.1.6 లక్షల 'వారియర్ డివిడెండ్' ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 1776లో దేశ స్థాపనకు గుర్తుగా ఆ మొత్తాన్ని మిలిటరీ సర్వీస్ మెంబర్లకు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన చెక్కులు సిద్ధమయ్యాయని, పండగకు ముందే సైనికులకు అందుతాయని చెప్పారు. దేశంలోని 14.5 లక్షల మంది సోల్జర్లకు ఈ మొత్తం అందనుంది.