శత జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

శత జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

ATP: శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు హాజరుకావాలని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని సత్యసాయి బాబా మండలి సభ్యులు ఆహ్వానించారు. ఈ మేరకు మండలి సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు పుట్టపర్తిలో శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయని తెలిపారు.