రైలు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

రైలు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

NDL: బేతంచర్ల పట్టణానికి చెందిన కోట్ల సుభాష్ (27) నంద్యాలలో పనిచేస్తూ నిన్న రాత్రి ఎన్ డీఎల్-బీటీసీ రైలులో ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ప్రయాణికులు గమనించి రైలు ఆపి వెంటనే ఆంబు ల్లెన్స్‌కు సమాచారం అందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో సుభాష్ మృతి చెందాడు. ఈ విషాదంలో అతను నివసిస్తున్న కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.