'కుక్కల బెడదపై దృష్టి పెట్టాలి'
అన్నమయ్య: రాయచోటి మున్సిపల్ ఛైర్మన్ షేక్ ఫయాజ్ బాష బుధవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలో విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, మున్సిపల్ సిబ్బంది కౌన్సిల్ బాడీతో కలిసి పనిచేసి పట్టణ సమస్యల పరిష్కారానికి సహకరించాలని సూచించారు.