'కాలువకు రిటర్నింగ్ వాల్ నిర్మించాలి'
VZM: బాడంగి మండలం బొత్సవానివలసలో కోతకు గురైన కాలువ గట్టును బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన పరిశీలించారు. మొంథా తుఫాను వర్షాలకు మల్లినాయుడు చెరువు నిండిపోయి సర్చ్‌లెస్ ద్వారా ప్రవహించిన నీటి వలన కాలువ చాలా వరకు కోతకు గురైంది. కాలువలు పరిశీలించి సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. కాలువకు రిటర్నింగ్ వాల్ నిర్మించాలని ఎమ్మెల్యే సూచించారు.