రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
ఏలూరు జిల్లా దుందులూరులోని పెదవేగిలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోడూరు సుధీర్ అనే వ్యక్తి లారీని ఢీకొని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు ముక్కాలంపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.