VIDEO: కూరగాయల దాతలకు ప్రశంసలు

TPT: 2004 నుంచి కూరగాయలను టీటీడీకి వితరణగా అందిస్తున్న దాతలను అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రశంసించారు. తిరుమల అన్నమయ్య భవనంలో కూరగాయల దాతలతో ఆయన మాట్లాడారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చిన 24 మందిని ఆయన సత్కరించారు. 'మీ సహకారంతోనే అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి అని కొనియాడారు.