VIDEO: కె.జగన్నాధపురంలో ఘనంగా లక్ష బిల్వార్చన పూజలు

VIDEO: కె.జగన్నాధపురంలో ఘనంగా లక్ష బిల్వార్చన పూజలు

కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత ఉమామహేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం లక్ష బిల్వార్చన పూజలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి అర్చకులు వేద మంత్రాలతో వినాయక పూజ, హోమాలు, యాగాలు చేశారు. సాయంత్రం ఆలయం వద్ద దీపోత్సవం కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.