గూనభద్ర రాధాకాంత స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు

SKLM: కొత్తూరు మండలం గూనభద్రలో వెలసిన శ్రీ రాధాకాంత స్వామి ఆలయంలో శనివారం రాత్రి ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణునికి ఉయ్యాల సేవతో పాటు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.