వేసవిలో ప్రజల దాహార్తికై మజ్జిగ పంపిణీ
VZM: వేసవి తీవ్రతను తట్టుకోవడానికి, ప్రజల దాహాన్ని తీర్చడానికి రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ ఆధ్వర్యంలో ఇవాళ మజ్జిగ పంపిణీ చేశారు. సంతపేట రామమందిరం దగ్గర 60రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు క్లబ్ ప్రెసిడెంట్ విజయ్ అగర్వాల్, సెక్రటరీ ఉదయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.