'సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు ఆర్థిక భరోసా'
SKLM: సీఎం రిలీఫ్ ఫండ్‌తో పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. బోరుభద్ర గ్రామానికి చెందిన ఇసాయి చిట్టమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.40,600ల చెక్కును ఎమ్మెల్యే గోవిందరావు తన కార్యాలయంలో సోమవారం చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.