చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కంభం పట్టణంలోని RTC బస్టాండ్ ఆవరణలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కంభం ఎంపీడీవో వీరభద్రాచారి, మండల నాయకులు పాల్గొన్నారు.