VIDEO: ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

VIDEO: ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్తులు, దీక్షాపరులతో కిటకిటలాడుతోంది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు, ఉప ఆలయాలైన బేతాళ, రామాలయాలు సందడిగా మారాయి. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుండడంతో భక్తులు ఉదయమే కొండకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వాహన పూజలకు నూతన వాహనాలు బారులు తీరాయి. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.