CMRF చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

CMRF చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

MDK: సీఎం సహాయ నిధి పథకం నిరుపేదలకు వరంగా మారిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లేశం అన్నారు. రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన ఇద్దరు బాధితులు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో రూ. 33,000 సీఎం సహాయనిధి మంజూరైంది. ఇవాళ బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు.