కన్నుల పండుగగా మల్లన్నస్వామి కళ్యాణం
HNK: ఐనవోలు మల్లన్న దేవస్థానంలో ఇవాళ శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడకల్లో భక్తులు పెద్దపట్నంపై నడుస్తూ, డ్యాన్స్‌లు చేస్తూ స్వామి వారి సేవలో మున్నిగిపోయారు. శరణు శరణు మల్లన్న అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలు, ఒగ్గు పూజారుల డప్పు దురువులతో దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.