VIDEO: పనులను పర్యవేక్షిస్తున్న కలెక్టర్
AKP: రాంబిల్లి మండలం రజాల వద్ద శారదా నదికి పడిన గండి పూడ్చే పనులను శుక్రవారం చేపట్టారు. కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు కూలీలను నియమించి పనులు చేస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహకారం అందిస్తున్నారు.