అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
BHPL: రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ను నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. SI సుధాకర్ వివరాల ప్రకారం.. టేకుమట్ల మండలానికి చెందిన ట్రాక్టర్ యజమాని విగ్నేష్, అతని డ్రైవర్ అనిల్ అనుమతి పత్రాలు లేకుండా ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు SI సుధాకర్ వెల్లడించారు.