సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించిన మాజీ ఎమ్మెల్యే
MDK: నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన నజీర్ హైమద్‌కు రూ.9వేలు, కొత్తపల్లికి చెందిన రామయ్యకు రూ. 22 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సాయి రెడ్డి, మండల సర్పంచ్‌ల ఫోరం మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ చారి, మాజీ ఎంపీటీసీ రాములు, మాజీ ఉపసర్పంచ్ రామచంద్ర పటేల్, తదితరులు ఉన్నారు.