245 కేజీల గంజాయి స్వాధీనం

245 కేజీల గంజాయి స్వాధీనం

ASR: ముంచింగిపుట్టు మండలం కుజబంగి వద్ద ఎస్సై జే.రామకృష్ణ ఆధ్యర్యంలో గురువారం వాహనాల తనిఖీలలో చేపట్టారు. ఈ తనిఖీల్లో ఆటోలో తరలిస్తున్న 245 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు పారిపోయారని వెల్లడించారు. గంజాయిని, ఆటోను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపించినట్లు ఎస్సై పేర్కొన్నారు.