అభివృద్ధి పనులు పరిశీలించిన మాజీమంత్రి
సత్యసాయి: సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకల సందర్భంగా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అధికారులు క్రాంతి కుమార్, నరసింహమూర్తితో కలిసి పరిశీలించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి వై జంక్షన్, బైపాస్ రోడ్డు, పుడా పార్క్ వరకు జరుగుతున్న పనులను ఆయన సమీక్షించారు.