VIDEO: తిమ్మాపురం క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం
SRPT: జాజిరెడ్డి గూడెం మండలంలోని తిమ్మాపురం స్వరూప శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. మహాశివరాత్రి పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు కోనేటిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైన ఆదివారం, శివరాత్రి ఒకేరోజు రావడంతో నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.