వీరేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా చండీహోమం

వీరేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా చండీహోమం

తూ.గో: మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో పాల్గుణ మాసం పౌర్ణమి మహపర్వదినం పురస్కరించుకుని చండీహోమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు శ్యామల కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గణపతి పూజ, మండప ఆరాధన, అనంతరం చండిహోమం, పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.