బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీపీ
SKLM: నరసన్నపేట మండలం కోటారుబిల్లి గ్రామానికి చెందిన మండల ప్రచార కమిటీ అధ్యక్షులు కోరుకొండ శాంతరావు అమ్మగారు తులసమ్మ (75) ఇటీవల స్వర్గస్థులయ్యారు. వారి కుటుంబ సభ్యులను ఎంపీపీ ఆరంగి మురళిధర్ పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొందర కూరకుల విభాగం అధ్యక్షులు అప్పన్న, తదితరులు ఉన్నారు.