ప్రజల నుంచి వినతులను స్వీకరించిన మంత్రి

ప్రజల నుంచి వినతులను స్వీకరించిన మంత్రి

ATP: అనంతపురం రామ్‌నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. ఆయన స్వయంగా వినతిపత్రాలను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.