ఆదిలాబాద్ రిమ్స్‌లో బేబీ ఫీడింగ్ రూమ్ ప్రారంభం
ఆదిలాబాద్ రిమ్స్ మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సన్ ఛారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేబీ ఫీడింగ్ రూమ్‌ను ఎంపీ నగేష్, ఛైర్‌పర్సన్ అనూషతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. రిమ్స్‌కు వచ్చే తల్లులు తమ పిల్లలకు పాలు పట్టడానికి ఈ ప్రత్యేక గదిని ఏర్పాటు చేసినట్లు వివరించారు.