జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ
NGKL: జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఈ నెల 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ మంగళవారం తెలిపారు. రాజకీయ పార్టీలు, యువజన, కుల సంఘాలు పోలీసుల ముందస్తు అనుమతులు లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని చెప్పారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.