సోయా కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన డీఎం

సోయా కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన డీఎం

SRD: మండల కేంద్రమైన కంగ్టిలోని మార్కెట్ గోదాంలో కొనసాగుతున్న PACS సోయా కొనుగోలు కేంద్రాన్ని మార్క్‌ఫెడ్ DM శ్రీదేవి సోమవారం సందర్శించి తనిఖీ చేశారు. కొనుగోలు చేసిన సోయా నిల్వలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో సోయా తూకం చేయాలని సిబ్బందిని సూచించారు. ఇంతవరకు 2500 క్వింటాళ్ల సోయా కొనుగోలు చేసినట్లు చెప్పారు.