బీజేపీ ఓబీసీ మోర్చా ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా సత్య సాయిరామ్

బీజేపీ ఓబీసీ మోర్చా ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా సత్య సాయిరామ్

E.G: బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా రాజమండ్రికి చెందిన కాలెపు సత్య సాయిరామ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రొంగాల గోపి శ్రీనివాస్ సోమవారం ప్రకటించారు. కాలెపు సత్య సాయిరామ్ గతంలో జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షుడుగా, బీజేపీ జిల్లా కార్యదర్శిగా, ఓబీసీ మోర్చా తూ.గో జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించారు.