మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన MPDO

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన MPDO

KDP: బద్వేల్ పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినీలకు అందించే మధ్యాహ్న భోజన పథకాన్ని బుధవారం ఎంపీడీవో మల్లీశ్వరి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలకు పోషక విలువలతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారా లేదా అని అక్కడే ఉన్న విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినిలతో కలిసి ఆమె భోజనం చేశారు.