నేటితో ముగియనున్న రెండో దశ ఎన్నికల ప్రచారం
SRPT: స్థానిక సంస్థల ఎన్నికల రెండో విడత ప్రచారం నేడు (శుక్రవారం) సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రతి ఓటరును కలుస్తున్నారు. ప్రచారం ముగిసిన తర్వాత, పట్టణాల్లోని ఓటర్లను చరవాణి ద్వారా సంప్రదించి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తులు కొనసాగనున్నాయి. కాగా, రెండో దశ పోలింగ్ ఆదివారం జరగనుంది.