మంత్రి కొలుసు పార్థసారథి ఫైర్
కృష్ణా: సీఎం చంద్రబాబు కాలు గోటికి సైతం సరిపోని నాయకులు ఆయనను అసభ్య పదజాలంతో దూషించడం బాధాకరమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.