మంత్రి లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే
ప్రకాశం: ఉండవల్లి నివాసంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గం, ప్రకాశం జిల్లా పరిధిలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా ఆంధ్రకేసరి యూనివర్సిటీ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించడంతో పాటు, టీచింగ్ స్టాఫ్ నియామకాలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు.