మే 8 నుంచి'సర్ విజ్జీ టీ-20 ట్రోఫీ'

మే 8 నుంచి'సర్ విజ్జీ టీ-20 ట్రోఫీ'

విజయనగరంలో మే 8 నుంచి సీనియర్ పురుషుల 'సర్ విజ్జీ టీ-20 ట్రోఫీ' జరగనుంది. ఈ మేరకు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సీతారామ రాజు బుధవారం వివరాలను వెల్లడించారు. జిల్లా వాసులు లేదా ఏడాదిగా ఇక్కడ చదువుతున్న, ఉద్యోగం చేస్తున్న వారు అర్హులని పేర్కొన్నారు. స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.