భోజనం సరిగా లేదని విద్యార్థుల ఆందోళన
WGL: కాకతీయ విశ్వవిద్యాలయం కామన్ మెస్‌లో విద్యార్థులకు మెనూ ప్రకారం ఉదయం అల్పాహారం అందించడం లేదని, నాణ్యమైన భోజనం కూడా ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారని విద్యార్థులు ఆరోపించారు. దీంతో విసుగు చెందిన విద్యార్థులు యూనివర్సిటీ మొదటి గేటు వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.