'ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం'
MNCL: జన్నారం మండలంలో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఎంపీడీవో కుమార్ ఉమర్ తెలిపారు. సోమవారం నుండి సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరణ ప్రారంభం కానున్నదని వెల్లడించారు. ఇందులో భాగంగా మండలంలో 8 క్లస్టర్లను ఏర్పాటు చేసి 8 మంది చొప్పున ఆర్వోలు, ఏఆర్ఓలను నియమించమన్నారు. పోటీ చేసేవారు ఆర్వోలు, ఏఆర్వోలకు దరఖాస్తుల సమర్పించాలన్నారు.